Technology

రూ.11.45 లక్షల నుంచి మహీంద్రా బీఈ6 స్పోర్టెక్

రూ.11.45 లక్షల నుంచి మహీంద్రా బీఈ6 స్పోర్టెక్

రూ.11.45 లక్షల నుంచి మహీంద్రా బీఈ6 స్పోర్టెక్

మహీంద్రా తన ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ బీఈ6 స్పోర్టెక్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. బ్యాటరీ-యాజ్-ఏ-సర్వీస్‌ విధానంలో ప్రారంభ ధర రూ.11.45 లక్షలు కాగా, బ్యాటరీతో కలిపి కొనుగోలు ధర రూ.19.45 లక్షల నుంచి మొదలవుతుంది. 59, 70, 79 కిలోవాట్ అవర్ లలో బ్యాటరీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. 79 కిలోవాట్ అవర్ బ్యాటరీతో గరిష్ఠంగా 682 కి.మీ. వరకు రేంజ్‌ లభిస్తుంది. స్పోర్టెక్‌లో మూడు 12.3 అంగుళాల స్క్రీన్లతో కూడిన కొత్త డ్యాష్‌బోర్డ్‌, గూగుల్ జెమినీ ఆధారిత AI అసిస్టెంట్‌, గేమింగ్‌, కరోకే, డాల్బీ ఆడియో వంటి ఫీచర్లు ఉన్నాయి. డ్రిఫ్ట్‌ మోడ్‌, యాక్సిలరేషన్‌ బూస్ట్‌, డిజిటల్‌ కార్‌ కీ వంటి సదుపాయాలు కూడా అందించారు. బ్యాటరీ యూజ్ ఏ సర్వీస్ విధానంలో బ్యాటరీ వినియోగానికి కిలోమీటరుకు రూ.3.75 చెల్లించాలి. వాహనాల డెలివరీలు ఆగస్టు 26 నుంచి ప్రారంభం కానున్నాయి.

Posted by Srikanth Bethi · Super Admin

Views · 71

Trending News

rains-farmersNewsWatch

rains-farmers

వర్షాల వల్ల సాగుకు ఊతం లభించింది.

115Aug 5, 2026