News
కూలీ.. గంటలో కోటీశ్వరుడయ్యాడు

కూలీ.. గంటలో కోటీశ్వరుడయ్యాడు
పూటగడవడానికి కూలి పనులు చేసుకునే ఓ వలస కార్మికుడు గంటలో ఏకంగా కోటీశ్వరుడయ్యాడు. పంజాబ్‌లోని బంగా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మధు ఉపాధి కోసం పంజాబ్‌కు వచ్చి వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. రోజువారీగా కూలి పనులకు వెళ్తున్న మధు.. బంగాలోని సహోటా లాటరీ స్టాల్ వద్ద టీ తాగాడు. ఆ పక్కనే ఉన్న సిక్కిం ప్రభుత్వ ‘డియర్ గణేశ్ చతుర్థి బంపర్ లాటరీ’ టికెట్‌ను కొన్నాడు. లాటరీ ఫలితాలు వెలువడటానికి కేవలం గంట ముందు ఆయన ఈ టికెట్ తీసుకున్నాడు. సరిగ్గా గంట తర్వాత ఫలితాలు వెలువడగా.. మధు కొనుగోలు చేసిన టికెట్‌కు ఏకంగా రూ.3 కోట్ల తొలి బహుమతి దక్కింది. ఈ విషయాన్ని తొలుత మధు నమ్మలేదు. సరదాగా ఆటపట్టిస్తున్నారమో అని అనుకున్నాడు. కానీ నిజం తెలిసిన తర్వాత ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. లక్ ఉంటే లక్ష్మీదేవి వెతుక్కుంటూ వస్తుందనేది మధు విషయంలో నిజమైందని స్థానికులు అంటున్నారు.
Posted by Srikanth Bethi · Super Admin
Views · 6








