Politics

టీడీపీ, జనసేన ఫ్రెండ్లీ పోటీ తప్పదా..?

టీడీపీ, జనసేన ఫ్రెండ్లీ పోటీ తప్పదా..?

టీడీపీ, జనసేన ఫ్రెండ్లీ పోటీ తప్పదా..?

ఏపీలో స్థానిక ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది. త్వరలోనే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ పైచేయి సాధించేందుకు కార్యకర్తలను సిద్ధం చేస్తున్నారు. ఎప్పటిలాగే లోకల్ ఎన్నికల్లో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా పోటీకి వెళ్లాలని ప్రాధమికంగా నిర్ణయించారు. వైసీపీ మళ్ళీ ఒంటరిగా పోటీ చేస్తోంది. అయితే.. కూటమి పార్టీల మధ్య సయోధ్య వున్నప్పటికి స్థానిక ఎన్నికల విషయంలో ఒక తాటి మీదకు రాలేకపోతున్నారు. జనసేన కార్యకర్తల అంచనాలకు తగినట్లుగానే సీట్ల కేటాయింపు ఉంటుందని భరోసా ఇచ్చిన పవన్ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేసినట్లు ఇప్పుడు త్యాగం చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఎక్కడైనా బలం వున్న చోట అవసరమైతే కూటమి నేతలతో ఫ్రెండ్లీగా పోటీ చేద్దామని తేల్చి చెప్పేశారు. అందుకే టీడీపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. దీంతో కూటమి మధ్య సీట్ల పంపకం ఎలా వున్నా ఫ్రెండ్లీ పోటీ తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Posted by Srikanth Bethi · Super Admin

Views · 6

Trending News

rains-farmersNewsWatch

rains-farmers

వర్షాల వల్ల సాగుకు ఊతం లభించింది.

110Aug 5, 2026