Politics

ఇండియా కూటమిలోకి వై.ఎస్. జగన్..?

ఇండియా కూటమిలోకి వై.ఎస్. జగన్..?

ఇండియా కూటమిలోకి వై.ఎస్. జగన్..?

వై.ఎస్. జగన్ ఓడిపోయాక కూడా ఆయన విధానాలను, శైలిని అత్యంత తీవ్రస్థాయిలో విమర్శిస్తూ వచ్చిన సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ, అనూహ్యంగా నేరుగా తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశ మైంది. తమ పార్టీ నిర్వహించే సదస్సుకు హాజరు కావాలంటూ జగన్‌ను ఆయన ఆహ్వానించడం కేవలం ఒక సాధారణ మర్యాదపూర్వక భేటీ ఎంతమాత్రమూ కాదు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే క్రమంలో, ఏపీలో వైఎస్సార్‌సీపీని మెల్లగా కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి వైపునకు తిప్పుకునేందుకు కమ్యూనిస్టులను దూతలుగా వాడుకుంటున్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బీజేపీ పై ఒత్తిడి పెంచడానికి మరో వైపు కమ్యూనిస్టులను వాడుకుంటూనే, మరోవైపు రాబోయే రోజుల్లో కేంద్రంలో అధికారం మారితే తమ ఉనికిని కాపాడుకోవడానికి జగన్ వేస్తున్న ఈ రాజకీయం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో అనేది ఆసక్తిగా మారింది.

Posted by Srikanth Bethi · Super Admin

Views · 6

Trending News

rains-farmersNewsWatch

rains-farmers

వర్షాల వల్ల సాగుకు ఊతం లభించింది.

110Aug 5, 2026