Movies
ప్యారడైజ్ రిలీజ్ తర్వాత.. మెగాస్టార్ ఆలోచన మారిందా..?

ప్యారడైజ్ రిలీజ్ తర్వాత.. మెగాస్టార్ ఆలోచన మారిందా..?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్యారడైజ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో మూవీ చేయబోతున్నట్టుగా ఎప్పుడో ప్రకటించారు. అయితే.. ప్యారడైజ్ మూవీలో వయోలెన్స్ ఎక్కువైందని.. లెంగ్త్ ఎక్కువైందని.. నిర్మాతతో అవసరం లేకపోయినా భారీగా ఖర్చు పెట్టించాడని శ్రీకాంత్ ఓదెల పై విమర్శలు వచ్చాయి. దీంతో శ్రీకాంత్ ఓదెలతో చేసే సినిమా విషయంలో చిరు ఆలోచనలో పడ్డారని టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్ సినిమా అంటే మాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవ్వాలి. ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ పర్ఫెక్ట్ గా కుదరాలి. శ్రీకాంత్ తన రా అండ్ రస్టిక్ స్టైల్ ను పూర్తిగా పక్కన పెట్టాల్సిన పని లేదు. కానీ.. అందరికీ కనెక్ట్ అయ్యేలా కథలో మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది. టాలీవుడ్ లో లాస్ట్ మినిట్ లో ఈక్వేషన్స్ మారడం కామనే. మరి.. ప్యారడైజ్ బాక్సాఫీస్ రన్ పూర్తయ్యాక చిరు, శ్రీకాంత్ ఓదెల సినిమా ఉంటుందా..? లేదా..? అనేది క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
Posted by Srikanth Bethi · Super Admin
Views · 12








