News
ఘనంగా షర్మిల కుమార్తె నిశ్చితార్థం.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి..

ఘనంగా షర్మిల కుమార్తె నిశ్చితార్థం.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి..
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమార్తె అంజిలి రెడ్డి, సోమల రఘురామ్ రెడ్డిల నిశ్చితార్థ వేడుక హైదరాబాద్ శివారులోని కొత్వాల్‌గూడలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాబోయే వధూవరులను ఆయన ఆశీర్వదించారు. ఈ నిశ్చితార్థ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహా పలువురు రాజకీయ ప్రముఖులు, కుటుంబ సభ్యులు, ఆత్మీయులు పాల్గొన్నారు. నూతన జంటకు వారు శుభాకాంక్షలు తెలియజేశారు. కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుక వైభవంగా జరిగింది. అయితే.. నవంబర్ 25న వివాహం, డిసెంబర్ 5న రిసెప్షన్ ఉంటుందని షర్మిల ఎక్స్ వేదికగా వెల్లడించారు.
Posted by Srikanth Bethi · Super Admin
Views · 12








