Sports
భారత అండర్-19 జట్టులో ద్రవిడ్, సెహ్వాగ్ కుమారులు

భారత అండర్-19 జట్టులో ద్రవిడ్, సెహ్వాగ్ కుమారులు
ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరగనున్న సిరీస్‌కు భారత అండర్-19 జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టులో టీమిండియా దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్ కుమారులు అన్వయ్ ద్రవిడ్, ఆర్యవీర్ సెహ్వాగ్‌లకు చోటు దక్కింది. ముఖ్యంగా ఆర్యవీర్‌కు తొలిసారి భారత్ అండర్-19 జట్టులో అవకాశం లభించింది. ఇద్దరూ వన్డే జట్టులో మాత్రమే ఉన్నారు. మూడు వన్డేలు, రెండు మల్టీడే మ్యాచ్‌లతో ఈ సిరీస్ జరగనుంది. వన్డేలకు లక్ష్య రాయ్‌చందాని కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. సెప్టెంబర్ 18 నుంచి రాజ్‌కోట్‌లో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.
Posted by Srikanth Bethi · Super Admin
Views · 16








