Movies
జైలర్ 2 వెర్సెస్ రణబాలి

జైలర్ 2 వెర్సెస్ రణబాలి
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న క్రేజీ సీక్వెల్ జైలర్ 2. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే.. ఈ మూవీని అక్టోబర్ 15న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే.. అక్టోబర్ 16న మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీ విడుదల కానుందని ప్రచారం జరిగింది. ఇప్పుడు విశ్వంభర రీషూట్ చేస్తున్నారు. ఆరు రోజులు రీషూట్ చేస్తే విశ్వంభర షూటింగ్ కంప్లీట్ అవుతుంది. అప్పుడు రిలీజ్ డేట్ పై క్లారిటీ వస్తుందట. దసరాకి విశ్వంభర రాదు.. దీపావళికి వచ్చే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. విజయ్ దేవరకొండ నటిస్తున్న మూవీ రణబాలి. ఈ మూవీని అక్టోబర్ 16న రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీంతో దసరాకి బాక్సాఫీస్ దగ్గర జైలర్ 2, రణబాలి పోటీపడనున్నాయి. మరి.. ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.
Posted by Srikanth Bethi · Super Admin
Views · 15








