Sports
మెస్సీ ఈవెంట్ వివాదం.. 33 వేల మందికి రిఫండ్.

మెస్సీ ఈవెంట్ వివాదం.. 33 వేల మందికి రిఫండ్.
మెస్సీ ఈవెంట్ వివాదంపై బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది జరిగిన ఈవెంట్‌కు టికెట్లు కొనుగోలు చేసిన 33 వేల మందికి డబ్బులు రిఫండ్ చేయాలని నిర్ణయించింది. మెస్సీకి భారీగా అభిమానులు ఉన్న నేపథ్యంలో ఆయనను చూసేందుకు అభిమానులు రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు చెల్లించి టికెట్లు కొనుగోలు చేశారు. అయితే 2025 డిసెంబర్‌లో కోల్‌కతా స్టేడియంలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో మెస్సీ మ్యాచ్ ఆడకుండానే వెనుదిరిగారు. దీంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన అభిమానులకు డబ్బులు తిరిగి చెల్లించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని సీఎం సువేందు అధికారి వెల్లడించారు.
Posted by Srikanth Bethi · Super Admin
Views · 43








