Technology
హోండా సీబీ500 విడుదల.. ధర రూ.2.75 లక్షల నుంచి

హోండా సీబీ500 విడుదల.. ధర రూ.2.75 లక్షల నుంచి
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా సీబీ500 బైక్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.2.75 లక్షలు (ఎక్స్‌షోరూమ్). మూడు వేరియంట్లలో లభించనుంది. అల్లోయ్ రూ.2.75 లక్షలు, స్పోక్ రూ.2,99,900, స్పోక్ విత్ స్ట్రైప్స్ రూ.3,01,900గా ధరలను నిర్ణయించింది. ఈ బైక్‌లో 501సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 28.1 హెచ్‌పీ పవర్, 43.3 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. హోండా రోడ్‌సింక్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, స్లిప్పర్ క్లచ్, స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం కాగా, దశలవారీగా డెలివరీలు చేయనుంది.
Posted by Srikanth Bethi · Super Admin
Views · 6








