Technology
6జీలో ఐఐటీ మద్రాస్ కీలక ముందడుగు

6జీలో ఐఐటీ మద్రాస్ కీలక ముందడుగు
భారత్ 6జీ సాంకేతికతలో ఐఐటీ మద్రాస్ శాస్త్రవేత్తలు కీలక విజయం సాధించారు. ‘భారత్ 6జీ టెరాహెర్ట్జ్ టెస్ట్‌బెడ్’పై పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో నిర్వహించిన పరీక్షల్లో 6.39 జీబీపీఎస్ డేటా ప్రసార వేగాన్ని నమోదు చేశారు. టెరాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌ను ఉపయోగించి ఈ పరీక్ష నిర్వహించారు. 5జీతో పోలిస్తే అత్యంత వేగవంతమైన డేటా ప్రసారంతో పాటు తక్కువ లేటెన్సీ, అధిక బ్యాండ్‌విడ్త్ సేవలకు ఈ సాంకేతికత ఉపయోగపడనుంది. ‘భారత్ 6జీ మిషన్’లో భాగంగా అభివృద్ధి చేసిన ఈ టెస్ట్‌బెడ్‌లో పరికరాలు, హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్‌లను దేశీయంగానే రూపొందించడం విశేషం. భవిష్యత్తులో ఏఐ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, స్మార్ట్ సిటీ కమ్యూనికేషన్స్, స్వయంప్రతిపత్తి వాహనాలు, రిమోట్ సర్జరీ వంటి రంగాల్లో 6జీ సాంకేతికత కీలకంగా మారనుంది. 2030 నాటికి వాణిజ్యపరంగా 6జీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న భారత్ లక్ష్యానికి ఈ విజయం ప్రాధాన్యంగా భావిస్తున్నారు.
Posted by Srikanth Bethi · Super Admin
Views · 83








