Politics
92 లక్షలకు చేరిన ఇంటింటి టీడీపీ

92 లక్షలకు చేరిన ఇంటింటి టీడీపీ
కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న 'ఇంటింటికీ తెలుగుదేశం – 2 ఏళ్ల నమ్మకం' కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా కొనసాగుతోంది. 34వ రోజుకు చేరిన ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 92.43 లక్షల కుటుంబాలను టీడీపీ నాయకులు, కార్యకర్తలు నేరుగా కలిశారు. శనివారం ఒక్కరోజే 1,87,654 ఇళ్లను సందర్శించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ పనితీరు పై ప్రజల స్పందనను తెలుసుకోవడంతో పాటు, వారి సమస్యలను అడిగి తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. టీడీపీ శ్రేణులు ప్రతి గడపకు వెళ్లి, ప్రభుత్వ పథకాల ద్వారా రైతులకు, మహిళలకు, యువతకు, పేదలకు అందుతున్న ప్రయోజనాలను వివరిస్తున్నారు.
Posted by Srikanth Bethi · Super Admin
Views · 29








