Politics

సీఎం రేవంత్‌రెడ్డికి బండ్ల గణేష్ విజ్ఞప్తి

సీఎం రేవంత్‌రెడ్డికి బండ్ల గణేష్ విజ్ఞప్తి

సీఎం రేవంత్‌రెడ్డికి బండ్ల గణేష్ విజ్ఞప్తి

తెలంగాణలో మొక్కజొన్నలు, సోయాబీన్, డీఓసీ సహా పౌల్ట్రీ పరిశ్రమకు అవసరమైన ముడిసరుకుల ధరల పెరుగుదలను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని పౌల్ట్రీ రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తమ సమస్యలను వివరిస్తూ ప్రముఖ నిర్మాణ బండ్ల గణేష్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. స్టాకిస్టులు ముడిసరుకులను గోడౌన్లలో నిల్వ ఉంచి కృత్రిమ కొరత సృష్టించడం ద్వారా ధరలు పెంచకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

పౌల్ట్రీ పరిశ్రమకు అవసరమైన ముడిసరుకులు మార్కెట్లో తగినంతగా అందుబాటులో ఉండేలా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే పలు సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పౌల్ట్రీ రైతుల పై ముడిసరుకుల ధరల పెరుగుదల మరింత ఆర్థిక భారాన్ని మోపే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

Posted by Beyond I Media· Admin

Views · 15

Trending News

rains-farmersNewsWatch

rains-farmers

వర్షాల వల్ల సాగుకు ఊతం లభించింది.

222Aug 5, 2026