Health
బెండకాయ వలన ఎన్ని ఉపయోగాలో తెలుసా..?

బెండకాయ వలన ఎన్ని ఉపయోగాలో తెలుసా..?
బెండకాయ అంటే ఇష్టపడేవారు చాలా మందే ఉంటారు. అయితే.. కొంత మంది మాత్రం దాంట్లో ఉండే జిగురు కారణంగా తినడానికి అంతగా ఇష్టపడరు. కానీ ఆ జిగురులోనే ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఉన్నాయని జీర్ణకోశ నిపుణులు చెబుతున్నారు. బెండకాయలోని పీచు పదార్థం జీర్ణక్రియకు తోడ్పడటంతో పాటు కొలెస్ట్రాల్ నియంత్రణలోనూ ఉపయోగపడే అవకాశం ఉందని వివరిస్తున్నారు. బెండకాయలోని కరిగే పీచు పదార్థం మల విసర్జన సాఫీగా జరిగేందుకు తోడ్పడుతుంది.
పేగుల్లో అది ముందుకు కదలడానికి పీచు ఉపయోగపడుతుంది. దీంతో మలబద్ధకం సమస్యను నివారించడంలో సహాయపడవచ్చు. అలాగే బెండకాయ కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది అంటున్నారు డాక్టర్లు. ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధపడేవారు బెండకాయలను తిన్నా.. బెండకాయ రసం తాగినా.. నొప్పులు పోతాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా బెండకాయ తినడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అంటున్నారు డాక్టర్లు.
Posted by Beyond I Media· Admin
Views · 7








