Politics

మహేశ్‌ గౌడ్‌, పొంగులేటి, వంశీకృష్ణకు బీఆర్‌ఎస్‌ లీగల్‌ నోటీసులు

మహేశ్‌ గౌడ్‌, పొంగులేటి, వంశీకృష్ణకు బీఆర్‌ఎస్‌ లీగల్‌ నోటీసులు

మహేశ్‌ గౌడ్‌, పొంగులేటి, వంశీకృష్ణకు బీఆర్‌ఎస్‌ లీగల్‌ నోటీసులు

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్‌ ఎంపీ గడ్డం వంశీకృష్ణకు బీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ నోటీసులు జారీ చేసింది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు కొండపోచమ్మ సాగర్‌ నీటిని మళ్లించారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ ఆరోపించింది. బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి, లీగల్‌ సెల్‌ ఇన్‌ఛార్జ్‌ సోమ భరత్‌ కుమార్‌ ఈ నోటీసులు పంపించారు. ముగ్గురు కాంగ్రెస్‌ నేతలు తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో చేసిన సంబంధిత పోస్టులను వెంటనే, బేషరతుగా తొలగించాలని, ఆరోపణలను ఉపసంహరించుకోవాలని నోటీసుల్లో కోరారు.

ఇదే అంశంపై ఇప్పటికే తెలుగు దినపత్రిక ‘వెలుగు’ యాజమాన్యం, సంపాదకుడికి నోటీసులు జారీ చేసినట్లు బీఆర్‌ఎస్‌ తెలిపింది. అయినప్పటికీ అదే ప్రచారాన్ని కొనసాగిస్తున్నారనే ఆరోపణతో కాంగ్రెస్‌ నేతలకు నోటీసులు పంపించినట్లు పేర్కొంది. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను సహించబోమని బీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ స్పష్టం చేసింది. నోటీసులకు స్పందించకపోతే పరువు నష్టం సహా వర్తించే చట్టాల ప్రకారం తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Posted by Beyond I Media· Admin

Views · 3

Trending News

rains-farmersNewsWatch

rains-farmers

వర్షాల వల్ల సాగుకు ఊతం లభించింది.

222Aug 5, 2026