Politics
అంబటి హోమ్ మినిష్టరా..?

అంబటి హోమ్ మినిష్టరా..?
వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో... 2022 వరకూ మంత్రి కాలేకపోయారు. జగన్ ప్రభజనంలో ఆయన సత్తెనపల్లిలో గెలిచి జగన్ మంత్రి మండలి విస్తరణలో రెండవ విడతల జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇదిలా ఉంటే.. అంబటి 2029 లో తొలి విడతలోనే హోం మంత్రిగా బాధ్యతలు తీసుకుంటాను అని అంటున్నారు. దీంతో ఆయనకు హోమ్ మంత్రి పదవి మీద మోజు ఉందని భావిస్తున్నారు.
గత కూటమి ప్రభుత్వంలో కూడా అనేక మంది హోం మంత్రిత్వ శాఖ మీద మోజు పెంచుకున్న వారే. కానీ అనూహ్యంగా అనితను ఆ పదవి వరించింది. నెక్ట్స్ టైమ్ వైసీపీ అధికారంలోకి వస్తుందని.. నేనే హోం మంత్రిని అవుతాను అని అంబటి చెబుతుండడం ఆసక్తిగా మారింది. మరి.. అంబటి అనుకుంటున్నట్టుగా వైసీపీ అధికారంలోకి వస్తుందా..? వస్తే.. అంబటికి హోమ్ మంత్రి పదవి ఇస్తారా లేదా తెలియలంటే.. 2029 వరుకు ఆగాల్సిందే.
Posted by Beyond I Media· Admin
Views · 6








