News

అద్వానీ కోలుకున్నారా..?

అద్వానీ కోలుకున్నారా..?

అద్వానీ కోలుకున్నారా..?

బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఛాతీ ఇన్ఫెక్షన్‌తో ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో చేరిన 98 ఏళ్ల అద్వానీ, ఆరోగ్యం మెరుగుపడటంతో ఇవాళ‌ ఇంటికి తిరిగి వెళ్లారు. ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు ఒక ప్రకటన విడుదల చేశాయి. ఈ నెల‌ 16వ తేదీ సాయంత్రం అస్వస్థతకు గురవడంతో ఆయనను కుటుంబసభ్యులు ఆసుపత్రిలోని పల్మనరీ విభాగంలో చేర్పించారు.

సీనియర్ న్యూరాలజీ కన్సల్టెంట్ డాక్టర్ వినీత్ సూరి పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందించారు. చికిత్సకు ఆయన శరీరం స్పందించిందని, ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినందున డిశ్చార్జ్ చేస్తున్నట్లు అపోలో ఆసుపత్రి పేర్కొంది. అద్వానీ ఆసుపత్రిలో ఉన్నప్పుడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా శనివారం ఆయనను పరామర్శించి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Posted by Beyond I Media· Admin

Views · 8

Trending News

rains-farmersNewsWatch

rains-farmers

వర్షాల వల్ల సాగుకు ఊతం లభించింది.

222Aug 5, 2026