Politics

వైఎస్సార్ సీపీపై చంద్రబాబు ఆగ్రహం

వైఎస్సార్ సీపీపై చంద్రబాబు ఆగ్రహం

వైఎస్సార్ సీపీపై చంద్రబాబు ఆగ్రహం

స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్యంలో ఎంతో కీలకమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఒక భాగమని, దానికి ఎవరూ అతీతులు కారని పేర్కొన్నారు. సోమవారం ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024 ఎన్నికల్లో ప్రజలు చరిత్ర సృష్టించారని చంద్రబాబు అన్నారు. కూటమికి 94 శాతం స్ట్రైక్‌ రేట్‌, 57 శాతం ఓట్‌ షేర్‌ ఇచ్చారని గుర్తుచేశారు. వైఎస్సార్ సీపీ పాలనలో జరిగిన అరాచకాలు, విధ్వంసంపై ప్రజలు తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల నిధులను మళ్లించారని, ఎన్నికల సంఘాన్ని బెదిరించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.

గతంలో వైఎస్సార్ సీపీ హయాంలో ఎంపీటీసీ స్థానాలు పెద్ద సంఖ్యలో ఏకగ్రీవమయ్యాయని చంద్రబాబు పేర్కొన్నారు. కడప జిల్లాలో 553 ఎంపీటీసీ స్థానాలకు 439 స్థానాలు ఏకగ్రీవమయ్యాయని తెలిపారు. గంజాయి స్మగ్లర్లకు టికెట్లు ఇచ్చిందని ఆరోపించారు. 2024 ఎన్నికల తర్వాత ఒక్కరోజు కూడా వృథా చేయకుండా సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు ప్రాధాన్యమిచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు.

Posted by Beyond I Media· Admin

Views · 5

Trending News

rains-farmersNewsWatch

rains-farmers

వర్షాల వల్ల సాగుకు ఊతం లభించింది.

222Aug 5, 2026