Politics

బిగ్ బ్రేకింగ్: దర్శిలో వైసీపీ నుంచి నామినేషన్లు లేవా?

బిగ్ బ్రేకింగ్: దర్శిలో వైసీపీ నుంచి నామినేషన్లు లేవా?

బిగ్ బ్రేకింగ్: దర్శిలో వైసీపీ నుంచి నామినేషన్లు లేవా?

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో దర్శి, గురజాల, పిడుగురాళ్ల ప్రాంతాల్లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. నామినేషన్ల గడువు ముగిసే సమయానికి దర్శి మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ తరఫున ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని సమాచారం. ఇదే పరిస్థితి గురజాల, పిడుగురాళ్లలోనూ నెలకొందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ పరిణామాలతో ఆయా మున్సిపాలిటీల్లో పోటీ ఎలా ఉండబోతోందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

దర్శిలో జనసేనకు, గురజాల–పిడుగురాళ్లలో తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని.. ఇక్కడ ఏకగ్రీవం అయ్యే పరిస్థితి ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, నామినేషన్ల వివరాలు, తుది అభ్యర్థుల జాబితా అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది.

Posted by Beyond I Media· Admin

Views · 13

Trending News

rains-farmersNewsWatch

rains-farmers

వర్షాల వల్ల సాగుకు ఊతం లభించింది.

222Aug 5, 2026