Media News
బీఆర్ఎస్ ఆస్తులు రూ.1,509 కోట్లు.. ఏడాదిలో రూ.162 కోట్ల ఖర్చు!

బీఆర్ఎస్ ఆస్తులు రూ.1,509 కోట్లు.. ఏడాదిలో రూ.162 కోట్ల ఖర్చు!
తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న భారత రాష్ట్ర సమితి ఆర్థిక వివరాలు ఆసక్తికరంగా మారాయి. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆడిట్ నివేదిక ప్రకారం, పార్టీ మొత్తం ఆస్తుల విలువ రూ.1,509 కోట్లుగా నమోదైంది. ఇందులో వివిధ బ్యాంకుల్లో ఉన్న నగదు నిల్వలే రూ.1,431 కోట్లుగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. 2026 మార్చి 31 నాటికి బీఆర్ఎస్‌కు వివిధ బ్యాంకుల్లో రూ.1,431 కోట్ల నగదు నిల్వలు ఉన్నట్లు ఆడిట్ నివేదికలో పేర్కొన్నారు.
వీటిలో రూ.1,237 కోట్లు ఏడాదికి మించిన కాలపరిమితి కలిగిన డిపాజిట్ల రూపంలో ఉన్నట్లు సమాచారం. ఇవే కాకుండా, రుణాలు, అడ్వాన్సులు, డిపాజిట్ల రూపంలో రూ.11.77 కోట్లు, భవనాలు, ఇతర భౌతిక ఆస్తుల రూపంలో రూ.66.26 కోట్లు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. ఈ వివరాలన్నీ కలిపి పార్టీ మొత్తం ఆస్తులు సుమారు రూ.1,509 కోట్లకు చేరుకున్నాయి.
Posted by Beyond I Media· Admin
Views · 28








