Media News
టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కలకలం..

టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కలకలం..
బాలీవుడ్ యాక్టర్ టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. ముంబైలోని జుహు ప్రాంతంలో ఉన్న ఓ పార్క్ నుంచి బయటకు వస్తున్న సమయంలో టైగర్ ష్రాఫ్ పై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది. వివరాల ప్రకారం.. టైగర్ ష్రాఫ్ పార్క్ నుంచి బయటకు వస్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆయనను లక్ష్యంగా చేసుకుని పలుమార్లు కాల్పులు జరిపారు. వరుసగా పలు రౌండ్ల కాల్పులు జరిపిన అనంతరం నిందితులు బైక్‌పై అక్కడి నుంచి వేగంగా పారిపోయినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ కాల్పుల ఘటనలో టైగర్ ష్రాఫ్ డ్రైవర్ గాయపడినట్లు సమాచారం. డ్రైవర్ గాయపడటంతో పరిస్థితిని గమనించిన నటుడు స్వయంగా కారు నడుపుకుంటూ అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో టైగర్ ష్రాఫ్ తీసుకున్న ఈ చర్య పై చర్చ జరుగుతోంది. అయితే.. దుండగులు ఎవరూ? కాల్పులకు గల కారణాలేంటి? అనేది తెలియాల్సివుంది.
Posted by Beyond I Media· Admin
Views · 13








