Politics
రోజాపై మాజీ వైసీపీ నేత కె.జె. శాంతి సంచలన వ్యాఖ్యలు

రోజాపై మాజీ వైసీపీ నేత కె.జె. శాంతి సంచలన వ్యాఖ్యలు
వైసీపీ మాజీ మంత్రి, నటి రోజా పై మాజీ వైసీపీ నేత కె.జె. శాంతి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గతంలో రోజా రాజకీయ ఎదుగుదల కోసం తాము ఎంతో కష్టపడ్డామని, అలాంటి తమ కుటుంబాన్నే ఇప్పుడు విమర్శించడం ఏమిటంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజాను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించేందుకు తాము జైళ్లకు సైతం వెళ్లామని పేర్కొన్నారు. రోజా రాజకీయాల కోసం తమ నగలు, ఆస్తులు అమ్ముకోవడంతో పాటు అప్పులపాలయ్యామని కె.జె. శాంతి ఆరోపించారు. రోజా కోసం సుమారు రూ.2 కోట్ల అప్పులు చేశామని పేర్కొన్నారు.
ఆరేళ్లపాటు తమ ఇంట్లోనే ఉండి, తమ సహకారంతో రాజకీయంగా ఎదిగిన రోజా.. ఇప్పుడు తమ కుటుంబాన్ని రౌడీలంటూ విమర్శించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. తమ కుటుంబం చేసిన సహాయాన్ని మరిచిపోయి విమర్శలు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, గంజాయి విక్రయాలు, స్మగ్లర్లతో సంబంధాల ద్వారా రోజా కోట్లు సంపాదించారని కె.జె. శాంతి ఆరోపణలు చేశారు. కె.జె. శాంతి చేసిన వ్యాఖ్యలపై రోజా స్పందన ఏమిటన్నది తెలియాల్సి ఉంది.
Posted by Beyond I Media· Admin
Views · 10








