Media News
ఆర్టీసీ ఛార్జీల పెంపుపై హరీశ్‌రావు ఆగ్రహం

ఆర్టీసీ ఛార్జీల పెంపుపై హరీశ్‌రావు ఆగ్రహం
పండగ నేపథ్యంలో తెలంగాణలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయాణికులపై అదనపు భారం మోపుతోందని ఆరోపించారు. రెగ్యులర్ బస్సులను తగ్గించి, స్పెషల్ బస్సుల పేరుతో దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్–హనుమకొండ మధ్య ఏసీ బస్సు టికెట్ ధర ఆగస్టు 20న రూ.410 ఉండగా, సెప్టెంబర్ 11 నాటికి రూ.570కు పెరిగిందని హరీశ్‌రావు గతంలో పేర్కొన్నారు.
అలాగే జేబీఎస్ నుంచి కరీంనగర్ కు రూ.230 చార్జీ ఉండగా.. దానిని రూ.400కి పెంచారని మండిపడ్డారు. ముందస్తు సమాచారం లేకుండా ఛార్జీలు పెంచడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పండగ సమయంలో ఆర్టీసీ చార్జీలు పెంచి ప్రజలకు పండగ సంబరం లేకుండా చేశారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
Posted by Beyond I Media· Admin
Views · 13








