Politics

నర్సీపట్నంలో జనసేన రాజకీయం మారబోతుందా..?

నర్సీపట్నంలో జనసేన రాజకీయం మారబోతుందా..?

నర్సీపట్నంలో జనసేన రాజకీయం మారబోతుందా..?

నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయ బాధ్యతలను ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్ బాబులకు అప్పగించారు. స్థానికల సంస్థల ఎన్నికలకు సంబంధించిన సమన్వయ విధులను జనసేన తరఫున వీరిద్దరూ నిర్వర్తించాలని పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఆదేశించారు. ప్రస్తుతం నర్సీపట్నం పి.ఓ.సి.గా ఉన్న రాజాన సూర్యచంద్రను ఆ బాధ్యతల నుంచి తప్పించారు.

జనసేన పక్షాన సమన్వయం చేయడంలో సూర్యచంద్ర చర్యల పై పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు నర్సీపట్నం నియోజకవర్గం సమన్వయ బాధ్యతలు తక్షణమే అమలులోకి వస్తాయని జనసేన పార్టీ తెలియచేసింది. మరి.. కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్ బాబులు బాధ్యతలు తీసుకోవడంతో నర్సీపట్నంలో జనసేన రాజకీయం మారబోతుందా అనేది ఆసక్తిగా మారింది.

Posted by Beyond I Media· Admin

Views · 12

Trending News

rains-farmersNewsWatch

rains-farmers

వర్షాల వల్ల సాగుకు ఊతం లభించింది.

222Aug 5, 2026