Politics

జగన్ విమర్శలకు నారా లోకేశ్ కౌంటర్..

జగన్ విమర్శలకు నారా లోకేశ్ కౌంటర్..

జగన్ విమర్శలకు నారా లోకేశ్ కౌంటర్..

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికార కూటమి, వైఎస్సార్‌సీపీ మధ్య రాజకీయ విమర్శలు వేడెక్కుతున్నాయి. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా టీడీపీ నేతలు, పోలీసులు అడ్డుకుంటున్నారంటూ వైఎస్ జగన్ చేసిన ఆరోపణలకు మంత్రి నారా లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయని పేర్కొంటూ, ఎన్నికల్లో గెలుపు అనేది ప్రజాక్షేత్రంలోనే తేలుతుందని వ్యాఖ్యానించారు. నామినేషన్ల ప్రక్రియలో తమ పార్టీ అభ్యర్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ ఆరోపించిన నేపథ్యంలో ఈ రాజకీయ వివాదం తెరపైకి వచ్చింది.

అధికార పార్టీ నేతలు, పోలీసుల తీరుపై జగన్ విమర్శలు చేయగా, మంత్రి లోకేశ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 22,800 నామినేషన్లు దాఖలయ్యాయని, అన్ని పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు ముందుకు వచ్చారని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. లోకేశ్ తన స్పందనలో.. ఒక్క ఓటు కూడా పడకముందే కొందరు ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపు ఫీల్డ్‌లో ఉంటుంది.. ప్రెస్‌మీట్‌లో కాదు. ప్రజల ముందుకు వెళ్తే ఎవరు గెలవాలో వాళ్లే నిర్ణయిస్తారు అంటూ ట్వీట్ చేశారు.

Posted by Beyond I Media· Admin

Views · 13

Trending News

rains-farmersNewsWatch

rains-farmers

వర్షాల వల్ల సాగుకు ఊతం లభించింది.

222Aug 5, 2026