Technology
కొత్త హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 4వీ బైక్ విడుదల

కొత్త హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 4వీ బైక్ విడుదల
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ 2026 ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 4వీ బైక్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.1.27 లక్షలుగా నిర్ణయించింది. స్టాండర్డ్, ప్రో, కార్బన్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ.1.27 లక్షలు, రూ.1.37 లక్షలు, రూ.1.41 లక్షలు. ఈ బైక్‌లో 164.32 సీసీ ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌ను అందించారు. ఇది 17.1 హెచ్‌పీ శక్తి, 14.6 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
కొత్త డిజైన్‌తో పాటు ప్రో వేరియంట్‌లో క్రూయిజ్ కంట్రోల్, మూడు రైడింగ్ మోడ్‌లు, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ఉన్నాయి. టాప్ వేరియంట్ కార్బన్‌లో 4.2 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లేను ఇచ్చారు. బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ప్రో, కార్బన్ వేరియంట్ల డెలివరీలు నవంబర్ 1 నుంచి, స్టాండర్డ్ వేరియంట్ డెలివరీలు 2027 జనవరి నుంచి మొదలుకానున్నాయి.
Posted by Beyond I Media· Admin
Views · 13








