Technology

డ్రైవర్ లెస్ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయా..?

డ్రైవర్ లెస్ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయా..?

డ్రైవర్ లెస్ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయా..?

హైదరాబాద్‌లో రోజురోజుకు ట్రాఫిక్ ఎంతలా పెరిగిపోతుందో తెలిసిందే. ఈ ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు లాస్ట్ మైల్ కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కొత్త రవాణా వ్యవస్థపై దృష్టి సారించిందని సమాచారం. మెట్రో స్టేషన్‌లో దిగగానే నేరుగా గమ్యస్థానానికి చేర్చే పాడ్ ట్యాక్సీ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఐటీ కారిడార్, సచివాలయం పరిసర ప్రాంతాల్లో మొత్తం 40.82 కిలోమీటర్ల మేర ఈ నెట్‌వర్క్‌ను నిర్మించాలని ప్రతిపాదిస్తూ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక నివేదిక సమర్పించారు. ఈ ప్రాజెక్టును పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ పద్ధతిలో చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెట్‌వర్క్‌ను ప్రధానంగా కూకట్‌పల్లి-రాయదుర్గం, రాయదుర్గం-నాలెడ్జ్ సిటీ, రాయదుర్గం/హైటెక్ సిటీ-ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సచివాలయం-ఎన్టీఆర్ మార్గ్ నాలుగు కారిడార్లలో ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 2030 నాటికి రోజుకు 5.42 లక్షల మంది, 2050 నాటికి 20.31 లక్షల మంది ప్రయాణిస్తారని నివేదిక అంచనా వేసింది.

Posted by Beyond I Media· Admin

Views · 64

Trending News

rains-farmersNewsWatch

rains-farmers

వర్షాల వల్ల సాగుకు ఊతం లభించింది.

222Aug 5, 2026