Health
ఉసిరి వలన ఎన్ని లాభాలో తెలుసా..?

ఉసిరి వలన ఎన్ని లాభాలో తెలుసా..?
ఉసిరి చూడడానికి చిన్నదిగానే ఉంటుంది కానీ.. దీనిలో మిటిమన్ సీ, యాంటీఆక్సిడెంట్లు, ఐరన్, కాల్షియం వంటి పోషకాలుంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా మన్ కీ బాత్ 138వ ఎపిసోడ్‌లో ఉసిరికాయ ప్రయోజనాలను వివరించారు. అందుకే.. ఈ మధ్యన ఉసిరి రసాన్ని చాలా మంది ఇష్టంగా సేవిస్తున్నారు. ఉసిరి రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ ఇస్తుంది.
ఇందులో ఉన్న యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు జుట్టును బలంగా, ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. ఇవి జుట్టు రాలడాన్ని పూర్తిగా నివారిస్తాయి. అంతే కాకుండా ఈ యాంటీఆక్సిడెంట్లు చర్మం పై ముడతలను తగ్గిస్తాయి. బరువు తగ్గాలనుకునే వాళ్లు ఉసిరి వాడితే తక్కువ రోజుల్లోనే బరువు తగ్గుతారు. అలాగే ఉసిరి రసం కళ్లకూ మేలు చేస్తుంది. దీనిలో ఉండే కెరోటిన్ దృష్టిని మెరుగుపరుస్తుంది. శుక్లాలు, కంటి ఒత్తిడి వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఇలా ఉసిరి వలన ఎన్నో లాభాలు ఉన్నాయి.
Posted by Beyond I Media· Admin
Views · 46








