Media News
రాజకీయాల్లోకి నయనతార..?

రాజకీయాల్లోకి నయనతార..?
సౌతిండియా లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా రాజకీయ రంగ ప్రవేశం చేస్తారంటూ ప్రచారం ఊపందుకుంది. గతంలో తమిళనాడులో దిగ్గజ నటి జయలలిత రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రిగా ఎదిగిన సంచలన చరిత్ర ఉంది. ఈ క్రమంలోనే 2031లో రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల టైమ్ కి నయనతార కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడతారనే ఊహాగానాలు సినీ, రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొట్టాయి.
అయితే.. ఈ ప్రచారం పై నయనతార భర్త, ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్ ఎట్టకేలకు స్పందించారు. ప్రస్తుతం తమ దృష్టంతా పూర్తిగా కుటుంబం, కెరీర్ పైనే ఉందంటూ పొలిటికల్ ఎంట్రీ రూమర్లకు ముగింపు పలికారు. ప్రస్తుతం నయనతార తల్లిగా తమ పిల్లల పెంపకాన్ని ఎంతో ఆస్వాదిస్తోందని.. వారి భవిష్యత్తుకే తాము ప్రాధాన్యత ఇస్తున్నామని విఘ్నేష్ శివన్ వెల్లడించారు. విఘ్నేష్ చెప్పిన మాటలను బట్టి నయనతారకు ఎలాంటి రాజకీయ ప్రణాళికలు లేవని.. ఎన్నికల్లో పోటీ చేసే వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తేలిపోయింది.
Posted by Beyond I Media· Admin
Views · 64








