Sports

హలో హైదరాబాద్.. అంటూ సందడి చేసిన ఇషాన్ కిషన్..

హలో హైదరాబాద్.. అంటూ సందడి చేసిన ఇషాన్ కిషన్..

హలో హైదరాబాద్.. అంటూ సందడి చేసిన ఇషాన్ కిషన్..

హైదరాబాద్‌లో క్రికెట్ సందడి మొదలైంది. టీమిండియా ఆటగాళ్లు నగరానికి చేరుకోవడంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. రేపు ఉప్పల్ స్టేడియంలో జరగనున్న మ్యాచ్ కోసం భారత జట్టు ఆటగాళ్లు హైదరాబాద్‌కు వచ్చారు. ఈ క్రమంలో యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ తనదైన శైలిలో నగరవాసులను పలకరిస్తూ సందడి చేశారు. విమానంలో ఇతర ఆటగాళ్లతో కలిసి హైదరాబాద్‌కు వస్తున్న సమయంలో ఆయన తీసిన వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది.

వివరాల్లోకి వెళ్తే.. రాబోయే మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ ప్రయాణ సమయంలో ఇషాన్ కిషన్ విమానం నుంచి వీడియో తీస్తూ హైదరాబాద్ ప్రజలను పలకరించారు. ‘హలో హైదరాబాద్.. ఎలా ఉన్నారు?’ అంటూ తెలుగులో నగరవాసులను ఆప్యాయంగా పలకరించారు. ఇషాన్ కిషన్ తెలుగు మాటలు విని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలోనూ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.

Posted by Beyond I Media· Admin

Views · 56

Trending News

rains-farmersNewsWatch

rains-farmers

వర్షాల వల్ల సాగుకు ఊతం లభించింది.

222Aug 5, 2026