Sports
సచిన్ బెస్ట్ బ్యాట్స్ మెన్ మాత్రమే.. బెస్ట్ క్రికెటర్ కాదు

సచిన్ బెస్ట్ బ్యాట్స్ మెన్ మాత్రమే.. బెస్ట్ క్రికెటర్ కాదు
క్రికెట్ దేవుడుగా క్రీడా ప్రపంచం కీర్తించే సచిన్ టెండూల్కర్ గురించి ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రెట్ లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. సచిన్ బెస్ట్ బ్యాట్స్ మెన్ మాత్రమేనని, బెస్ట్ క్రికెటర్ కాదని పేర్కొన్నాడు. ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. బ్యాటింగ్‌లో అత్యుత్తమ ఆటగాడు సచిన్ టెండూల్కర్ మాత్రమేనంటూనే.. ఆల్‌రౌండ్ ప్రదర్శన విషయానికి వస్తే దక్షిణాఫ్రికా దిగ్గజం జాక్వెస్ కాలిస్ తన దృష్టిలో అత్యుత్తమ క్రికెటర్ అని స్పష్టంచేశాడు. కాలిస్ కేవలం బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ అద్భుతంగా రాణించారని బ్రెట్ లీ కొనియాడాడు. ప్రత్యర్థులు ఎప్పుడూ అతడిని తక్కువ అంచనా వేయలేదని, మ్యాచ్ ఫలితాన్ని ఒంటిచేత్తో మార్చగల సామర్థ్యం కాలిస్‌కు ఉందని చెప్పాడు. క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో కాలిస్ ఒకరని ప్రశంసించాడు. అలాగే సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ ప్రతిభపై బ్రెట్ లీ ప్రశంసలు కురిపించాడు. తాను ఎప్పుడైనా ఒక ఆటగాడి బ్యాటింగ్ చూడాలనుకుంటే సచిన్ టెండూల్కర్‌నే ఎంచుకుంటానని తెలిపాడు,
Posted by Kishore Goud· Super Admin
Views · 38








