Technology

లాంబోర్ఘినీ నుంచి మియురా స్పెషల్ ఎడిషన్

లాంబోర్ఘినీ నుంచి మియురా స్పెషల్ ఎడిషన్

లాంబోర్ఘినీ నుంచి మియురా స్పెషల్ ఎడిషన్

లగ్జరీ కార్ల తయారీ సంస్థ లాంబోర్ఘిని తన ఐకానిక్‌ మియురా మోడల్‌ 60వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక రెవుల్టో మియురా 60° హోమేజ్‌ ఎడిషన్‌ను ఆవిష్కరించింది. మియురా వారసత్వాన్ని ఆధునిక సూపర్‌కార్‌ సాంకేతికతతో కలిపి ఈ ప్రత్యేక మోడల్‌ను రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా కేవలం 99 కార్లను మాత్రమే తయారు చేయనున్నారు. మియురా స్ఫూర్తితో తొమ్మిది ప్రత్యేక రంగులు, రెండు ఎక్స్‌క్లూజివ్‌ లివరీలను ఇందులో అందించారు. ఇంటీరియర్‌లోనూ పాత మియురా డిజైన్‌ను గుర్తు చేసే లెదర్‌ సీట్లు, ప్రత్యేక స్టిచింగ్‌, ‘మియురా 60’ బ్యాడ్జింగ్‌ ఉన్నాయి. ఇక పనితీరు విషయానికి వస్తే.. 6.5 లీటర్‌ నేచురల్లీ ఆస్పిరేటెడ్‌ వీ12 ఇంజిన్‌తో కూడిన ప్లగ్‌-ఇన్‌ హైబ్రిడ్‌ పవర్‌ట్రెయిన్‌ను ఇందులో కొనసాగించారు. ఎలక్ట్రిక్‌ మోటార్లతో కలిపి అధిక పనితీరును అందించేలా ఈ కారును రూపొందించారు. మియురా చరిత్రకు నివాళిగా తీసుకొచ్చిన ఈ లిమిటెడ్‌ ఎడిషన్‌ కలెక్టర్లకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

Posted by Kishore Goud· Super Admin

Views · 51

Trending News

rains-farmersNewsWatch

rains-farmers

వర్షాల వల్ల సాగుకు ఊతం లభించింది.

110Aug 5, 2026