Health

పుట్టబోయే శిశువు నోటిలో మరో పిండం..

పుట్టబోయే శిశువు నోటిలో మరో పిండం..

పుట్టబోయే శిశువు నోటిలో మరో పిండం..

హిమాచల్‌ప్రదేశ్‌లో అరుదైన ఘటన వెలుగుచూసింది. 20 ఏళ్ల యువతి గర్భంలో ఉన్న శిశువు నోట్లో మరో పిండం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత అరుదుగా కనిపించే ఈ పరిస్థితి లక్షల్లో ఒకరికి మాత్రమే సంభవించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా ఒక పిండం మరో పిండం శరీరంలో అభివృద్ధి చెందడాన్ని ఫీటస్‌ ఇన్‌ ఫీటుగా పేర్కొంటారు. కవలల గర్భధారణ సమయంలో ఒక పిండం సరిగా అభివృద్ధి చెందక శరీరంలో ఉండిపోతుందని.. అయితే ఈ కేసులో ఆ పిండం శిశువు నోట్లో ఉండటంతో ప్రత్యేకంగా పర్యవేక్షించినట్టు వైద్యులు చెప్పారు. స్కానింగ్‌ ద్వారా సమస్యను గుర్తించిన అనంతరం శిశువు ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. ఇది తల్లి ప్రాణాలకు ముప్పుగా మారే అవకాశం ఉండటంతో ఆమె గర్భాన్ని తొలగించారు.

Posted by Kishore Goud· Super Admin

Views · 72

Trending News

rains-farmersNewsWatch

rains-farmers

వర్షాల వల్ల సాగుకు ఊతం లభించింది.

110Aug 5, 2026
పుట్టబోయే శిశువు నోటిలో మరో పిండం.. | Beyond I Media News