Technology

ఒకే ఒక్క కస్టమర్ కోసం ఫెరారీ నుంచి ప్రత్యేక కారు

ఒకే ఒక్క కస్టమర్ కోసం ఫెరారీ నుంచి ప్రత్యేక కారు

ఒకే ఒక్క కస్టమర్ కోసం ఫెరారీ నుంచి ప్రత్యేక కారు

ఇటలీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఫెరారీ సీజెడ్26 పేరుతో ప్రత్యేక వన్‌-ఆఫ్‌ సూపర్‌కారును ఆవిష్కరించింది. ఈ కారును అమెరికాకు చెందిన ఓ ప్రత్యేక కస్టమర్‌ కోసం ఫెరారీ స్పెషల్‌ ప్రాజెక్ట్స్‌ విభాగం సుమారు రెండేళ్లపాటు అభివృద్ధి చేసింది. 1970ల నాటి ఇటాలియన్‌ పారిశ్రామిక డిజైన్‌ స్ఫూర్తితో దీని రూపకల్పన చేశారు. ప్రత్యేకమైన బాడీ డిజైన్‌, కొత్త స్పాయిలర్‌, డిఫ్యూజర్‌ సీజెడ్26 ప్రత్యేకతలు. లోపల 3డీ ప్రింటెడ్‌ సీట్‌ ఇన్‌సర్ట్స్‌, కార్బన్‌ ఫైబర్‌ ట్రిమ్‌, ప్రత్యేక ఫ్యాబ్రిక్‌ను ఉపయోగించారు. ఈ కారులో 3.9 లీటర్‌ ట్విన్‌ టర్బో వీ8తో పాటు మూడు ఎలక్ట్రిక్‌ మోటార్లతో కూడిన హైబ్రిడ్‌ వ్యవస్థ ఉంది. మొత్తం శక్తి దాదాపు 1,000 హెచ్‌పీ. 0–100 కి.మీ. వేగాన్ని 2.5 సెకన్లలో అందుకోగలదు. గరిష్ఠ వేగం గంటకు 328 కి.మీ.గా ఉంది. సీజెడ్26 ఒక్క కారుగానే తయారైంది. దీని ధరను ఫెరారీ వెల్లడించలేదు.

Posted by Srikanth Bethi · Super Admin

Views · 78

Trending News

rains-farmersNewsWatch

rains-farmers

వర్షాల వల్ల సాగుకు ఊతం లభించింది.

110Aug 5, 2026