Media News
అసలు ఏ టైమ్లో రాఖీ కట్టాలి..?

అసలు ఏ టైమ్లో రాఖీ కట్టాలి..?
సోదర సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పండుగ ఎప్పుడు అనే సందిగ్ధత పై పంచాంగకర్తలు, పండితులు స్పందించారు. ఈ ఏడాది ఆగస్టు 28, శుక్రవారం రోజున ఈ పండుగను జరుపుకోవాలని క్లారిటీ ఇచ్చారు. అంతే కాకుండా.. రాఖీ కట్టేందుకు ఉదయం వేళ అత్యంత శ్రేష్ఠమైన సమయమని పండితులు చెప్పారు. హిందూ పంచాగం ప్రకారం, శ్రావణ పౌర్ణమి తిథి ఆగస్టు 27, గురువారం ఉదయం 9:08 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 28, శుక్రవారం ఉదయం 9:48 గంటలకు ముగుస్తుంది. శాస్త్రోకంగా సూర్యోదయం సమయంలో ఉన్న తిథిని ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి, 28వ తేదీనే పౌర్ణమిగా పరిగణించాల్సి ఉంటుంది. ఆగస్టు 28, శుక్రవారం ఉదయం రాఖీ కట్టేందుకు అత్యంత శుభ ముహూర్తం ఉందని పండితులు తెలిపారు.
Posted by Srikanth Bethi · Super Admin
Views · 34








