Movies
ఇరుముడి కోసం ఆందోళన..

ఇరుముడి కోసం ఆందోళన..
మాస్ మహారాజ రవితేజ హీరోగా ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన చిత్రం ఇరుముడి. ఈ చిత్రం ఊహించని సక్సెస్ అందుకొని బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపుతుంది. అయితే.. ఈ చిత్రం అందుకున్న సక్సెస్ మాత్రం ఒక్క ఆన్లైన్ లో భారీ బుకింగ్స్ తోనే కాదు ఆఫ్ లైన్ లో కూడా కనిపిస్తుంది. లేటెస్ట్ గా తెలంగాణాలో ఓ అరుదైన సంఘటన జరిగింది. ముక్తల్ ప్రాంతంలో వెంకట రమణ అనే సింగిల్ స్క్రీన్ లో ఇరుముడి సినిమా విజయవంతంగా ప్రదర్శన జరుగుతుంది. దీనితో టికెట్స్ కూడా దొరక్కుండా చాలామంది ఇంటికి తిరిగి వెళ్ళిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయట. అయితే.. ఇరుముడి సినిమాని తీసి మరో సినిమాని వేయడంతో ఆ సినిమానే ఉందనుకొని థియేటర్ వద్దకి వచ్చిన జనం అంతా ఇరుముడి షో వెయ్యాల్సిందే అని బైఠాయించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనితో ఇరుముడి సినిమా ఏ రేంజ్ సక్సెస్ అందుకుందో చెప్పడానికి ఇదే నిదర్శనం అని చెప్పవచ్చు.
Posted by Srikanth Bethi · Super Admin
Views · 18








