Movies
ఆత్మీయ మిత్రుడిని కోల్పోయాను - చిరంజీవి

ఆత్మీయ మిత్రుడిని కోల్పోయాను - చిరంజీవి
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలిసి సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, తన ఆత్మీయ మిత్రుడిని కోల్పోయానంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, ఆత్మీయ మిత్రుడు నారాయణరావు ఇక లేరనే వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణరావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, "నారాయణరావుతో తనకు ఎంతో సన్నిహితమైన అనుబంధం ఉందని.. 'దేవాంతకుడు', 'యముడికి మొగుడు' వంటి చిత్రాలను తనతో నిర్మించిన నిర్మాతగా మా ప్రయాణంలో ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి అని పేర్కొన్నారు మెగాస్టార్ చిరంజీవి.
Posted by Srikanth Bethi · Super Admin
Views · 14








