Politics
దానం నాగేంద్రకు కోపం వచ్చిందా..?

దానం నాగేంద్రకు కోపం వచ్చిందా..?
ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ అలిగారు. డబుల్ బెడ్ రూం లక్కీ డ్రా కార్యక్రమం నుంచి మధ్యలోనే వెళ్ళిపోయారు. నిన్నటి వరకు కొండా సురేఖ, చిన్నా రెడ్డి తలనొప్పితో అధికార పార్టీ కాస్త రిలాక్స్ మోడ్ లోకి వెళుతున్న సమయంలో దానం నాగేందర్ ఎపిసోడ్ జరగడం చర్చనీయాంశంగా మారింది. దానం ఎందుకు అలిగి వెళ్లిపోయారంటే..
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కొమరం భీమ్ ఆదివాసీ భవన్ లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం లక్కీ డ్రా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యేగా దానం నాగేందర్ ముఖ్య అతిధిగా హాజరుకావాల్సింది. అయితే.. ఆయన రాకుండానే అధికారులు లక్కీ డ్రా నిర్వహించారు. అధికారుల తొందరపాటు ఇప్పుడు సమస్యగా మారింది. అందుకే దానం నాగేంద్ర అలిగారని సమాచారం.
Posted by Srikanth Bethi · Super Admin
Views · 40








