Politics
ఎంపీ లాడ్స్ వినియోగంలో వెనకబాటు

ఎంపీ లాడ్స్ వినియోగంలో వెనకబాటు
తెలంగాణ ఎంపీలు కేంద్రం నుంచి తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం కేటాయించిన ఎంపీ లాడ్స్ నిధుల వినియోగంలో వెనుకబడుతున్నారు. లోక్‌సభ, రాజ్యసభకు చెందిన మొత్తం 23 మంది ఎంపీలకు గత రెండేళ్లలో కేంద్రం రూ.394 కోట్లు కేటాయించగా.. అందులో కేవలం రూ.94 కోట్ల మేర మాత్రమే వినియోగించారు. దేశవ్యాప్తంగా ఎంపీ లాడ్స్ నిధుల సగటు వినియోగం 75 శాతం ఉండగా, తెలంగాణ 23 శాతంతో 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 24వ స్థానంలో నిలిచింది. ఆరుగురు ఎంపీలు 10 శాతం కంటే తక్కువే ఖర్చు చేశారు. వీరిలో అసదుద్దీన్ ఒవైసీ, కె.రఘువీర్, జి.కిషన్‌రెడ్డి, పార్థసారథి రెడ్డి, రేణుకా చౌదరి, అభిషేక్ సింఘ్వీ ఉన్నారు. ధర్మపురి అరవింద్ నిధుల వినియోగంలో ముందున్నారు. గత రెండేళ్లలో తనకు కేటాయించిన రూ.28 కోట్లలో రూ.15.68 కోట్లను (56 శాతం) ఖర్చు చేశారు. మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ సుమారు 49 శాతం నిధులను వినియోగించగా, బీఆర్‌ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర 48 శాతం నిధులు ఖర్చు చేశారు.
Posted by Srikanth Bethi · Super Admin
Views · 36








