Health

హెచ్ఐవీని అరికట్టే ఇంజక్షన్ వచ్చిందా..?

హెచ్ఐవీని అరికట్టే ఇంజక్షన్ వచ్చిందా..?

హెచ్ఐవీని అరికట్టే ఇంజక్షన్ వచ్చిందా..?

హెచ్ఐవీ అంటే ఒకప్పుడు మరణమే అనేట్టుగా భయపడేవారు కానీ.. ఇప్పుడు మెరుగైన చికిత్స అందుబాటులో ఉంది. హెచ్ఐవీ వచ్చిన వారు ప్రతి రోజు టాబ్లెట్స్ వేసుకునే బదులు ప్రతి ఎనిమిది వారాలకు ఒకసారి ఇచ్చే లాంగ్ యాక్టింగ్ ఇంజెక్షన్లు వైరస్ ను మరింత సమర్ధవంతంగా అదుపులో ఉంచుతున్నాయని తాజాగా ఒక క్లినికల్ ట్రయల్లో తేలింది. ఈ ఇంజక్షన్ ద్వారా యువతలో వైరస్ మళ్లీ విజృంభించే ప్రమాదం గణనీయంగా తగ్గినట్లు ప్రఖ్యాత వైద్య పత్రిక ది లాన్సెట్ లో ప్రచురితమైన అధ్యయనం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రెండు నెలలకు ఒకసారి తీసుకునే ఇంజెక్షన్ చికిత్స వారికి గొప్ప ఊరటనిస్తుంది. ఇది వారి మానసిక ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు. మొత్తంమీద హెచ్‌ఐవీతో జీవిస్తున్న యువతకు చికిత్సను మరింత సులభతరం చేయడానికి, వారి జీవన నాణ్యతను మెరుగుపరచడానికి ఈ లాంగ్-యాక్టింగ్ ఇంజెక్షన్లు ఒక బలమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తున్నాయని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది.

Posted by Srikanth Bethi · Super Admin

Views · 6

Trending News

rains-farmersNewsWatch

rains-farmers

వర్షాల వల్ల సాగుకు ఊతం లభించింది.

115Aug 5, 2026