Politics

అందుకే.. గంటా గూటికే గురి పెట్టిన బొత్స

అందుకే.. గంటా గూటికే గురి పెట్టిన బొత్స

అందుకే.. గంటా గూటికే గురి పెట్టిన బొత్స

వైసీపీ మాజీ మంత్రి, సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఏరి కోరి టీడీపీకి చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గూటికే గురి పెట్టేశారని ప్రచారం జరుగుతుంది. గంటాకు భీమిలీలో ఉన్న పట్టు ఎలాంటిదో అందరికీ తెలిసిందే. 2014లో ఆయన తొలిసారి పోటీ చేసినపుడు 45 వేల దాకా భారీ మెజారిటీ వస్తే 2024లో అది కాస్తా రెట్టింపు అయి 90 వేలకు చేరుకుని ఏపీలోనే టాప్ త్రీలో ఒకటిగా నిలిచింది. ఇదిలా ఉంటే.. 2024 ఎన్నికలు అయితే కూటమి ప్రభంజనం చూపించింది కానీ,.2029 ఎన్నికలు ఖచ్చితంగా వైసీపీకి కలసి వస్తుందని బొత్స వర్గం అంచనా వేస్తోంది. మరో వైపు చూస్తే ఎన్నికల నాటికి రాజకీయ సామాజిక సమీకరణలలో భారీ మార్పులు ఉంటాయని ఊహిస్తోంది. గంటా నిలబడితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొంత వ్యతిరేక ఉంటుందని భావిస్తున్నారు. ఆయన బదులు కుమారుడు నిలబడితే తమకు లాభమే అని వైసీపీ లెక్క వేసుకుంటోంది. ఇలా అన్ని రకాలైన అంచనాలు వేసుకునే బొత్స గంటా గూటికే గురి పెట్టి తన కుమార్తెని భీమిలీ నుంచి రంగంలోకి దింపుతున్నారు రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.

Posted by Srikanth Bethi · Super Admin

Views · 6

Trending News

rains-farmersNewsWatch

rains-farmers

వర్షాల వల్ల సాగుకు ఊతం లభించింది.

110Aug 5, 2026