Politics

పిఠాపురంలో.. పవర్ స్టార్.ఏం చేసారో తెలుసా..?

పిఠాపురంలో.. పవర్ స్టార్.ఏం చేసారో తెలుసా..?

పిఠాపురంలో.. పవర్ స్టార్.ఏం చేసారో తెలుసా..?

పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన రెండో రోజుకు చేరుకుంది. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు ప్రజల సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలును స్వయంగా పరిశీలించారు. ముందుగా చేబ్రోలు రామాలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యు.కొత్తపల్లి మండలం నాగులపల్లిలో రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ పథకాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఆ తర్వాత కొండేవరం గ్రామంలో ఇంటింటికీ అందించిన కుళాయి కనెక్షన్లను పవన్ కళ్యాణ్ స్వయంగా తనిఖీ చేసారు. క్షేత్రస్థాయిలో పథకాల అమలు, ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించారు.

Posted by Srikanth Bethi · Super Admin

Views · 7

Trending News

rains-farmersNewsWatch

rains-farmers

వర్షాల వల్ల సాగుకు ఊతం లభించింది.

110Aug 5, 2026