Health
ఆరోగ్యంగా.. ఆనందంగా.. ఉండాలంటే..

ఆరోగ్యంగా.. ఆనందంగా.. ఉండాలంటే..
మనం చిన్న చిన్న పనులను పోస్ట్ పోన్ చేస్తుంటాం. పాస్ పోర్ట్ ఎక్కడో పెట్టుంటాం.. ఇప్పుడు వెతకాలా.. అని ఆలోంచి వాయిదా వేస్తాం. బండి ఏదో రిపేర్ ఉంటుంది.. కానీ తర్వాత చేయిద్దాం లే అనుకుంటాం. పెట్రోలు కొట్టించాలి కానీ.. లైన్ అయ్యే వరుకు వెయిట్ చేయాలి కదా.. అని పెట్రోల్ అయిపోయిన తర్వాత చూద్దాం లే అనుకుంటాం.. ఎగ్జామ్స్ కోసం ఓ చాప్టర్ చదవాలి.. కానీ చదువుదాంలే అని పక్కనపెడతాం.. ఇలా చిన్న చిన్న పనులు డైలీ లైఫ్ లో చాలా ఉంటాయి. ఈ పనులు చేయకుండా మైండ్లో ప్రజెర్ పెంచుకుంటూ పోతాం.. చేయాల్సిన పనులు చాలా ఉన్నప్పుడు ప్రశాంతంగా నవ్వలేము.. అస్సలు హ్యాపీగా ఉండలేము.. ఒక్కో పని చేస్తే.. ఈ చిన్న పని అయిపోయిందా.. ఇన్నాళ్లు మోసానా అనిపిస్తుంటుంది. వాయిదా వేసిన పనులు అన్నీ చేస్తుంటే.. చాలా హ్యాపీగా అనిపిస్తుంది.. ఏదో పవర్ వచ్చినట్టుగా ఫీలింగ్ కలుగుతుంది. మనకు పవర్ రావాలంటే.. జిమ్ కి వెళ్లి కండలు పెంచాల్సిన పని లేదు. పోస్ట్ పోన్ చేసిన పనులు ఒక్కొక్కటి చేసుకుంటూ వెళితే సూపర్ మ్యాన్ లా ఫీలవుతాం. చిన్న చిన్న పనులు చేస్తే.. నీలో కాన్షిడెన్స్ వేరే లెవల్లో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే.. ఫస్ట్ బాల్ లోనే సిక్సర్ కొట్టిన సచిన్ లా ఉంటాం. అందుకే.. చిన్న చిన్న పనులు పోస్ట్ పోన్ చేయకుండా వెంటనే చేసేయండి.. ఆరోగ్యంగా.. ఆనందంగా ఉండండి..
Posted by Beyond I Media· Admin
Views · 100








