Technology
రేపే హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్

రేపే హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని అక్టోబర్ 6న భారత్‌లో విడుదల చేయనుంది. 2023లో మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఎలివేట్‌కు ఇదే తొలి ప్రధాన అప్‌డేట్. ఇప్పటికే ఈ కొత్త మోడల్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఫేస్‌లిఫ్ట్‌లో కొత్త గ్రిల్, మారిన బంపర్లు, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, రీడిజైన్ చేసిన లైటింగ్‌తో పాటు వెనుకవైపు కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్‌ల్యాంప్స్ వచ్చే అవకాశం ఉంది. క్యాబిన్‌లో పెద్ద టచ్‌స్క్రీన్, మెరుగైన కనెక్టెడ్ ఫీచర్లు, 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు వంటి కొత్త ఫీచర్లు అందించనున్నట్లు సమాచారం. ఇంజిన్‌లో మాత్రం పెద్ద మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తోనే మాన్యువల్, సీవీటీ గేర్‌బాక్స్ ఆప్షన్లు కొనసాగనున్నాయి.
Posted by Beyond I Media· Admin
Views · 108








