Sports

దిల్లీ హెడ్ కోచ్ దాదా

దిల్లీ హెడ్ కోచ్ దాదా

దిల్లీ హెడ్ కోచ్ దాదా

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ కొత్త బాధ్యతలు తీసుకున్నారు. దిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్గా నియమితులయ్యారు. 2027 ఐపీఎల్ సీజన్ నుంచి జట్టును ముందుండి నడిపించనున్నారు. ఈ విషయాన్ని దిల్లీ యాజమాన్యం ఎక్స్ వేదికగా తెలియచేశారు. దిల్లీ.. దాదాగిరి చేసే సమయం వచ్చేసింది అని పేర్కొంది. ఒక ఐపీఎల్ జట్టుకు దాదా హెడ్ కోచ్గా బాధ్యతలు నిర్వర్తించడం ఇదే తొలిసారి. ఇక దిల్లీ జట్టుతో గంగూలీకి సుదీర్ఘ అనుభవం ఉంది. 2019లో సలహాదారుగా ఈ ప్రాంఛైజీతో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. తర్వాత మహిళల, పురుషుల జట్లకు క్రికెట్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. గత కొన్ని సీజన్లుగా దిల్లీ పేలవ ప్రదర్శన చేస్తుండటంతో.. జట్టు బృందంలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. హెడ్ కోచ్ పదవి తన బాధ్యతను మరింత పెంచిందని.. జట్టును మరింత బలంగా ముందుకు తీసుకెళ్లడానికి ఎదురుచూస్తున్నాను అన్నారు గంగూలీ. మరి.. దాదా దిల్లీ జట్టు తలరాత ఎలా మారుస్తారో చూడాలి.

Posted by Beyond I Media· Admin

Views · 71

Trending News

rains-farmersNewsWatch

rains-farmers

వర్షాల వల్ల సాగుకు ఊతం లభించింది.

222Aug 5, 2026