Movies
రణబాలి జెన్యూన్ రివ్యూ..

రణబాలి జెన్యూన్ రివ్యూ..
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం రణబాలి. ఈ మూవీకి రాహుల్ సాంకృత్యన్ డైరెక్టర్. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రణబాలి భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ దేవరకొండ ఇందులో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే వీర యోధుడిగా పాత్రకు తగ్గట్టుగా అద్భుతంగా నటించాడు. బ్రిటిష్ పాలన సమయంలో జరిగిన పరిణామాలను కళ్లకు కట్టినట్టుగా చూపించారు. సినిమా ప్రారంభం నుంచే ప్రేక్షకుడు కథలో లీనమయ్యేలా దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ కథనం రాసుకోవడం సినిమాకి ప్లస్ అని చెప్పచ్చు.
అలాగే జయమ్మ పాత్రలో రష్మిక మందన్న నటన వేరే లెవల్. ఆమె కెరీర్లో ఎప్పటికీ మరచిపోలేని పాత్రల్లో జయమ్మ పాత్ర ఒకటిగా నిలిచింది. ఈ సినిమా చూస్తుంటే.. బ్రిటీష్ వాళ్ల కాలంలో ఇంత జరిగిందా అని షాక్ అయ్యేలా ఉంది. చరిత్రలో మనకు తెలియని కథను బయటకు తీసి తెర పై అద్భుతంగా ఆవిష్కరించాడు రాహుల్ సాంకృత్యన్. త్రిశూలం పట్టుకుని విజయ్ దేవరకొండ విశ్వరూపం చూపించాడు. ఈ మూవీకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరు బెస్ట్ అనిపించేలా వర్క్ చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. రణబాలి.. విజయ్, రష్మిక, రాహుల్ సాంకృత్యన్ కెరీర్లోనే ఎప్పటికీ మరచిపోలేని సినిమా. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి.
Posted by Beyond I Media· Admin
Views · 23








