Movies
ప్రభాస్ పెళ్లి గురించి.. అప్ డేట్ ఇచ్చిన పెద్దమ్మ శ్యామలాదేవి

ప్రభాస్ పెళ్లి గురించి.. అప్ డేట్ ఇచ్చిన పెద్దమ్మ శ్యామలాదేవి
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన వివాహానికి సంబంధించి ఎప్పటికప్పుడు పలు వార్తలు, ఊహాగానాలు తెరపైకి వస్తున్నా.. ఇప్పటి వరకు అధికారికంగా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో ప్రభాస్ పెళ్లిపై ఆయన పెద్దమ్మ శ్యామలాదేవి తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని శ్యామలాదేవి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రభాస్ పెళ్లి గురించి ప్రస్తావించగా, అమ్మవారి దయతో వివాహం త్వరలో జరుగుతుందని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు.
తమ ఇంటికి కోడలు రావాలని ఉంటుందని, ఆ శుభదినం కోసం తాము ఎదురుచూస్తున్నామని ఆమె చెప్పారు. ఇక ప్రభాస్ చేస్తున్న సినిమాల గురించి మాట్లాడుతూ.. ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 ఈ మూడు సినిమాలు అద్భుతమైన సినిమాలు అని.. ఈ సినిమాలు ఖచ్చితంగా అందర్నీ ఆకట్టుకుని బ్లాక్ బస్టర్స్ అవుతాయని ఆమె చెప్పారు. అయితే.. ప్రభాస్ పెళ్లి గురించి ఎలాంటి డేట్ చెప్పకపోవడంతో మ్యారేజ్ ఎప్పుడు అనే సస్పెన్స్ కొనసాగుతుంది.
Posted by Beyond I Media· Admin
Views · 15








