Movies
విజయ్ గురించి సందీప్ రెడ్డి వంగ సంచలన వ్యాఖ్యలు

విజయ్ గురించి సందీప్ రెడ్డి వంగ సంచలన వ్యాఖ్యలు
విజయ్, రశ్మిక జంటగా నటించిన చిత్రం రణబాలి. ఈ సినిమాను సందీప్ రెడ్డి వంగ వీక్షించారు. ఈ సినిమా చూసిన అనంతరం తన అనుభూతిని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే ఇక పై విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారని అన్నారు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. రణబాలి సినిమాలో విజయ్ చేసిన యాక్షన్, ఫెరోషియస్ పర్ ఫార్మెన్స్ యూనిక్ గా ఉందని ఆయన తన పోస్ట్ లో పేర్కొన్నారు. అంతే కాకుండా.. విజయ్... నీ యాక్షన్, ఫెరోషియస్ పర్ ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది.
స్క్రీన్ మీద నీ ఫైట్స్ చూస్తుంటే.. ఆ ఇంటెన్సిటీ ఫీల్ అయ్యాం అన్నారు. ప్రేక్షకులు రణబాలి సినిమాను విజయ్ ఔట్ స్టాండింగ్ పర్ ఫార్మెన్స్ కోసం చూడాలి. రశ్మిక జయమ్మ పాత్రలో ఆకట్టుకుంది. ఆమె పాత్ర ఎంతో రియలిస్టిక్ ఫీల్ ను కలిగించింది. అజయ్ - అతుల్ మ్యూజిక్ మరో హైలైట్ గా నిలిచిందని.. చరిత్ర నుంచి ఇలాంటి ఒక నేపథ్యాన్ని ఎంచుకుని సినిమాగా రూపొందించిన డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను. మన పాఠ్యపుస్తకాల్లో చెప్పని చారిత్రక అధ్యాయాన్ని రణబాలి చూపించింది అన్నారు.
Posted by Beyond I Media· Admin
Views · 19








