Movies

సీతమ్మ లుక్ అదిరింది..

సీతమ్మ లుక్ అదిరింది..

సీతమ్మ లుక్ అదిరింది..

సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న మూవీ రామాయణ. ఈ భారీ బడ్జెట్ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం బెంగళూరులో జరిగింది. ఈ వేడుకలో సీత పాత్రధారి సాయి పల్లవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన పాత్రకు తగ్గట్టుగా, సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తూ ఆమె ధరించిన గులాబీ రంగు పట్టుచీర అందరి దృష్టినీ ఆకర్షించింది. నితీశ్ తివారీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగాన్ని దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు చిత్రబృందం మొత్తం హాజరైంది.

ఈ సందర్భంగా సాయి పల్లవి ప్రత్యేకంగా డిజైన్ చేయించిన గులాబీ రంగు సిల్క్ శారీలో కనిపించారు. చీరపై వెండి జర్దోసీ వర్క్, వెండి బ్రోకేడ్‌తో వృత్తాకార మోటిఫ్‌లు, బోర్డర్ వెంబడి కట్‌వర్క్ డిజైన్ అద్భుతంగా ఉన్నాయి. దానికి సరిపోయేలా మోచేతుల వరకు చేతులున్న బ్లౌజ్‌ను ధరించారు. నగలు కూడా హుందాగా, తక్కువగా ఎంచుకున్నారు. స్టడెడ్ చెవిపోగులు, ఉంగరాలు, చేతికి కొన్ని గాజులతో చాలా అందంగా క‌నిపించారు. సహజంగా కనిపించేలా, తక్కువ మేకప్‌తో ఆమె మరింత అందంగా కనిపించారు.

Posted by Beyond I Media· Admin

Views · 25

Trending News

rains-farmersNewsWatch

rains-farmers

వర్షాల వల్ల సాగుకు ఊతం లభించింది.

222Aug 5, 2026