Bakthi
తిరుమల యాత్ర.. యాప్ ఎలా పని చేస్తుందంటే..

తిరుమల యాత్ర.. యాప్ ఎలా పని చేస్తుందంటే..
భక్తులకు తిరుమల యాత్రను మరింత సులభతరం చేసేందుకు టీటీడీ 'వెంకటాద్రి' యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలతో, ఎన్ఆర్ఐ నిపుణుల బృందం సహకారంతో ఈ యాప్ను సిద్ధం చేసింది. సుమారు 150 రకాల సేవలు, 200లకు పైగా కీలక ప్రాంతాలను దీంట్లో మ్యాపింగ్ చేశారు. దగ్గరలో తాగునీరు ఎక్కడుంది?', దర్శన స్లాట్ క్యూలైన్కు ఎటు వెళ్లాలి?'.. తదితర ప్రశ్నలు అడిగితే ఏఐ ఆధారిత వాయిస్ కమాండ్ గోవిందా బదులిస్తాడు. యూజర్లు గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ను ఎలా వినియోగించాలి? ఇందులో పొందుపర్చిన మరిన్ని సేవల గురించి టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వివరించారు.
Posted by Beyond I Media· Admin
Views · 20








